నిమ్జ్ చెక్ డ్యామ్ పనులను పరిశీలించిన కలెక్టర్ పి. ప్రవీణ్య
SRD: జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య ఝరాసంగం మండలంలోని బర్దీపూర్, చిల్లపల్లి గ్రామాల్లో నిమ్జ్ (NIMZ) ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని, భూ సేకరణ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.