క్రైస్తవులకు అండగా ఉంటా: సామినేని

క్రైస్తవులకు అండగా ఉంటా: సామినేని

NTR: క్రీస్తు బోధనలు ప్రపంచ మానవాళికి ఆదర్శనీయమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. జగ్గయ్యపేట సెయింట్ థామస్ చర్చి గోల్డెన్ జూబ్లీ వేడుకల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మైనార్టీలకి, క్రైస్తవులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ తుమ్మల ప్రభాకర్ పాల్గొన్నారు.