మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీ ర్యాలీ

కాకినాడ: రౌతులపూడి మండలంలో మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్య భాస్కరరావు ఆధ్వర్యంలో విజయ ఉత్సాహం ర్యాలీ నిర్వహించారు. స్థానిక దుర్గ గుడి దగ్గర నుండి గ్రామం మొత్తం టీడీపీ శ్రేణులతో కలిపి ర్యాలీ నిర్వహించారు. అనంతరం వరుపుల సత్య ప్రభ రాజాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.