గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం
GNTR: చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామం పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతుడి వయసు సుమారు 50–55 సంవత్సరాలు ఉంటాయని చేబ్రోలు పోలీస్ ఎస్సై వీరనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. మృతుడి ఆచూకీ తెలిసినవారు చేబ్రోలు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.