24 నుంచి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగస్టు 23న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు. ఆలయంలో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.