రైతులు లాభాల బాటలో నడిచేలా ప్రణాళికలు: కలెక్టర్

KDP: వ్యవసాయ రంగంలో రైతులు లాభాల బాటలో నడిచేలా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాస్తవ్రేత్తలు, విస్తరణ అధికారులకు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సూచించారు. సీకే దిన్నె మండలం ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో 2 రోజుల దక్షిణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది.