హోటళ్లలో విజిలెన్స్ తనిఖీలు.. గ్యాస్ సిలిండర్ల సీజ్
GNTR: వాణిజ్య అవసరాలకు వాడుతున్న గృహోపయోగ గ్యాస్ సిలిండర్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గుంటూరులోని సంగడిగుంట వద్ద ఉన్న స్పైసీ ఫుడ్స్ హోటల్‌లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న 4 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. వాటిని పౌరసరఫరాల అధికారులకు అప్పగించారు. సదరు దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు.