'విద్యా రంగంలో సమస్యలు పరిష్కరించాలి'

'విద్యా రంగంలో సమస్యలు పరిష్కరించాలి'

AKP: విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డీ. బాబ్జి డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న విజయవాడలో విద్యార్థి పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్. రాయవరం మండలం అడ్డరోడ్డులో గోడపత్రిక ఆవిష్కరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.6,400 కోట్లు విడుదల చేయాలన్నారు.