చెరువును తలపిస్తున్న పాఠశాల ఆవరణ

చెరువును తలపిస్తున్న పాఠశాల ఆవరణ

SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడంతో స్థానిక పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు పాఠశాల ఆవరణలో చేరాయి. పాఠశాల ప్రాంగణం లోతట్టు ప్రదేశంలో ఉండడంతో రోడ్డుపై ప్రవహించే నీరంతా పాఠశాల ఆవరణలో చేరుతోంది. దిగువకు వర్షం నీరు జోరుగా కురవడంతో ఈ పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.