నెలాఖరు వరకు పొగాకు కొనుగోళ్లు: అచ్చెన్నాయుడు

NLR: సెప్టెంబర్ నెలాఖరులోగా నల్ల బర్లీ పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. 'రాష్ట్రంలో 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. మార్కెఫెడ్, ప్రైవేటు కంపెనీలు 55 మిలియన్ల కిలోలు కొన్నాయి. మిగిలిన పొగాకులో నెలాఖరులోగా 5 మి. కిలోలు మార్కెఫెడ్, 20 మి. కిలోలు ప్రైవేటు కంపెనీలు కొనుగోలు చేయాలి.