ఇంటి ముందు డ్రైనేజీలో కొండచిలువ
VSP: ఆరిలోవ క్రాంతినగర్ సమీపంలో మంగళవారం ఉదయం కొండచిలువ హల్‌చల్ చేసింది. సుమారు 10అడుగుల కొండచిలువ ఇంటి ముందు కాలువలో కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందారు. వెంటనే ఫారెస్ట్ రేస్క్యు టీంకి సమాచారం ఇవ్వగా పట్టుకోలేక వెనుదిరిగారు. గోడ రంద్రంలో దూరిన పామును స్థానికులు పట్టకుని కొండవాలు ప్రాంతంలో వదిలేశారు.