సీఎం సహాయనిది పేదలకు వరం: ఎమ్మెల్సీ

సీఎం సహాయనిది పేదలకు వరం: ఎమ్మెల్సీ

HYD: సీఎం సహాయనిది పేద ప్రజలకు వరంగా మారిందని ఎమ్మెల్సీ మీర్జా రెహమత్‌బేగ్ అన్నారు. సోమవారం MIM పార్టీ కార్యాలయంలో అమన్‌నగర్‌కు చెందిన సయ్యద్ అలీకి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. సీఎంఆర్ఎఫ్ సహాయంతో ఇప్పటివరకు ఎంతోమంది పెద్దలు లబ్ధిపొందారని గుర్తుచేశారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారు కార్పొరేట్ స్థాయి వైద్య సేవల కోసం సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.