తృటిలో తప్పిన పెను ప్రమాదం

తృటిలో తప్పిన పెను ప్రమాదం

మార్కాపురం చెరువు కట్ట రోడ్డుపై తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపైన ఉన్న గోతులు తప్పించే క్రమంలో ఒంగోలు నుంచి మార్కాపురం వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ఆటో చెరువుకట్ట అంచున నిలిచిపోయింది. కారు రహదారిపై ఆగిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.