నేలకొరిగినా జీవం కోల్పోలేదు

నేలకొరిగినా జీవం కోల్పోలేదు

WGL: ఆ చెట్టుకు బతకాలనే తపన చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పర్వతగిరి మండలంలో భారీ వృక్షం రెండేళ్ల క్రితం వచ్చిన వరదలకు కూకటివేళ్లతో సహా నేలకొరిగినా తన జీవాన్ని మాత్రం కోల్పోలేదు. వేర్లతో సహా బయటకు వచ్చి కింద పడ్డ కొమ్మలు మాత్రం ప్రస్తుత వర్షాలకు కొత్త చిగురుతో కళకళలాడుతున్నాయి. కింద పడినప్పటికీ జీవం కోల్పోకుండా పచ్చగా ఉన్న చెట్టును పలువురు తిలకిస్తున్నారు.