మహిళా సమైక్య ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ
KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నిరుపేద కుటుంబాలకు మహిళా సమైక్య ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. తాహసీల్దార్ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిన్న సాయంత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు మహిళా సమైక్య అందిస్తున్న చేయూత ఎంతో ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రామనారాయణ గౌడ్ మహిళా సమైక్య అధ్యక్షురాలు పావని ఉన్నారు.