మున్సిపల్ కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు: ఎస్పీ
SRPT: మున్సిపల్ ఎన్నికల లెక్కింపునకు 350 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. SRPTలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని, గుర్తింపు కార్డున్న వారికే అనుమతినిస్తామన్నారు. విజయోత్సవ ర్యాలీలు, డీజేలు, టపాకాయలపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.