VIDEO: సీపీఐ రాష్ట్ర మహాసభలకు పయనం

ELR: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, ప్రజా సంఘాల కార్మిక సంఘాల బాధ్యులు ఒంగోలులో జరుగుతున్న 28వ మహాసభలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా శనివారం ఏలూరు ఏరియా సమితి కార్యాలయం స్ఫూర్తి భవన్ నుండి ఎర్రజెండాలు చేతపట్టి, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ జయప్రదం చేయండి అంటూ నినాదాలు చేశారు.