ఢిల్లీ బ్లాస్ట్: ఆ వర్సిటీలో ఏం జరుగుతోంది?
ఢిల్లీ బ్లాస్ట్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. తాజాగా అల్ ఫలాహ్ వర్సిటీకి చెందిన ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ వర్సిటీపై పూర్తి స్థాయి నిఘాను పెట్టారు. తాజా పరిణామాలతో ఆ వర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు విద్యాలయాన్ని వదిలి ఇళ్లకు వెళ్తున్నారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.