ఎలక్షన్ డ్యూటీలో 500 మంది పోలీసులు
RR: షాద్‌నగర్‌లో రేపు జరిగే సర్పంచ్ ఎన్నికలు శాంతియుతంగా జరగాలని అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలపై కఠిన నిఘా, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటేయాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వవద్దని సూచించారు. ఇద్దరు ఏసీపీలు, 10 మంది CIలు, 30 మంది SIలు, 500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశానమని ఆయన పేర్కొన్నారు.