వాయు లింగేశ్వరుని దర్శించుకున్న ఏపీ సీఎం సెక్రటరీ
TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకు ఏపీ సీఎం సెక్రటరీ ప్రద్యుమ్న మంగళవారం కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. ప్రద్యుమ్న ప్రత్యేక రాహుకేతు పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించి మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించారు.