సూర్యలంక బీచ్‌కు మహర్దశ
BPT: రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ నూకసాని బాలాజీ సూర్యలంక సముద్ర తీరాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యలంక సముద్ర తీర ప్రాంతంలోని కాటేజీలు, పర్యాటకులు సేదతీరే ప్రదేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. తీరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.97.57 కోట్లు అందజేసినట్లు పేర్కొన్నారు.