కోర్లపాడు టోల్గేట్ వద్ద నకిలీ పోలీసుల వీరంగం
NLG: కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ముగ్గురు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. టోల్ రుసుము కట్టకుండా ఉండేందుకు నకిలీ పోలీస్ ఐడీ కార్డును ప్రదర్శించి భయపెట్టే ప్రయత్నం చేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై చిందులు తొక్కుతూ కార్యాలయంలోకి చొరబడ్డారు. కార్డు పరిశీలించిన సిబ్బంది అది నకిలీదని తేల్చడంతో యువకులు అడ్డంగా దొరికిపోయారు.