ఒంటిమిట్టలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
KDP: ఒంటిమిట్ట మండలంలోని చింతరాజు పల్లె, ఎరుకుల పాలెంలోని 15 నిరుపేద కుటుంబాలకు ఆదివారం ఆశాకిరణం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజ సేవ చేయాలన్న సంకల్పంతో అసోసియేషన్ ద్వారా కొంతకాలంగా నిరుపేదలకు పలు రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.