'స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి'

'స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి'

VKB: శిరిడి సాయినగర్ కాలనీలో మంగళవారం "ఇంటింటికీ బీజేపీ- గడపగడపకు బూత్ స్థాయి అధ్యక్షుడు" అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శక్తి కేంద్రం ఇంఛార్జ్ ఆంజనేయులు, బూత్ అధ్యక్షుడు అజయ్ గుప్తా ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.