ఎస్సైను అభినందించిన ఎస్పీ
MHBD: కురవి మండలంలో వరుసగా నమోదైన పలు కేసులను విజయవంతంగా చేధించి నిందితులకు శిక్ష పడేలా చేసిన కురవి ఎస్సై గండ్రాతి సతీష్‌ను జిల్లా ఎస్పీ శబరీష్ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్సైని ప్రశంసా పత్రంతో సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఇలాగే ప్రజల భద్రత కోసం మరిన్నిసేవలు కొనసాగించాలని, మరింత చురుకుదనంతో పని చేయాలని సూచించారు.