భక్తులతో పోటెత్తిన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి

NDL: రుద్రవరం మండల కేంద్రంలో సోమవారం నాడు కృష్ణాష్టమి సందర్భంగా స్థానిక శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చన కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం 6 గంటలకి ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.