ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

NTR : నందిగామ పట్టణం కాకాని నగరంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ప్రజా దర్పార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు, అందజేస్తామని తెలిపారు