నేడు జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు

MDK: మెదక్ పట్టణంలోని గుల్షన్ క్లబ్‌లో గురువారం నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో పాల్గొనడానికి 15 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. ఉత్తమ ప్రతిభకనబరిచిన 8 మంది బాలురు, 8 మంది బాలికలతో కూడిన జిల్లా జట్టును ఎంపిక చేస్తామన్నారు.