కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20ల్లో ఒకే వేదికలో (బెంగళూరు) ఎక్కువ సిక్సులు (152) కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. క్రిస్ గేల్ 151 సిక్స్‌లతో (బెంగళూరు) రెండో స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో ఒక టీమ్ తరఫున ఎక్కువ సిక్స్‌లు కొట్టింది కూడా కోహ్లీనే. RCB తరఫున విరాట్ ఇప్పటివరకు 301 సిక్స్‌లు బాదాడు.