ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం
SKLM: పలాస నియోజకవర్గంలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షులు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రగతి భవన్ ఆవరణలో వైసీపీ జెండాను ఆవిష్కరించారు.