మేడారం జాతరకు 100 ఆర్టీసీ బస్సులు
MHBD: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తొర్రూరు డిపో నుంచి 100 బస్సులు అందుబాటులో ఉన్నాయని DM పద్మావతి బుధవారం తెలిపారు. పెద్దలకు రూ.360, పిల్లలకు రూ.260, వర్ధన్నపేట నుంచి పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.150 టికెట్ ధర నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.