ఉల్లేపల్లి రామాలయంలో దొంగతనం
MHBD: మరిపెడ మండలం ఉల్లేపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. గ్రామంలోని రామాలయంలో గుర్తు తెలియని దుండగులు చొరబడి సుమారు రూ. 3.50 లక్షల విలువైన కిలోకు పైగా వెండి కిరీటాలు, హారతి పళ్ళెం అపహరించారని స్థానికులు తెలిపారు. ఆలయ తలుపులు తెరిచి ఉండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.