కుప్పంలో 163 సెక్షన్ అమలు

CTR: కుప్పంలో 163 సెక్షన్ విధిస్తూ తహశీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వై.చిట్టిబాబు ఉత్తర్వులు విడుదల చేశారు. సోమవారం కుప్పం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మండల సచివాలయానికి వంద మీటర్ల వరకు ప్రజలు ఎవ్వరూ గుంపులు గుంపులుగా ఉండొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.