ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు: కలెక్టర్
WGL: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.