VIDEO: భారీ వర్షాలు.. వెంకటగిరి సీఐ కీలక సూచన
TPT: వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ రమణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో తుఫాను నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ ఒకటో తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలువలు, కాజ్వేలు దాటడానికి ప్రయత్నించవద్దని సూచించారు.