'సంతానం కోసం గరుడ ముద్ద ప్రసాదం'

'సంతానం కోసం గరుడ ముద్ద ప్రసాదం'

NZB: భీమగల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 29న ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వ్యవస్థాపక ధర్మకర్త నంబి లింబాద్రి తెలిపారు. సంతానం కోరుకునే భక్తులు గరుడముద్ద ప్రసాదం కోసం ఆ రోజున ఉపవాసంతో విచ్చేయాలని ఆయన సూచించారు. తిరిగి నవంబర్ 6న భక్తులు కొండపైకి చేరుకుని, నవంబర్ 7న పోలు దారం వేసుకోవాలని చెప్పారు.