గుర్తు తెలియని మహిళ మృతి

WGL: పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్‌లో శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ప్రముఖ అన్నారం దర్గా షరిఫ్ దగ్గర మతిస్థిమితం లేని వారిని విడిచివేళ్ళడం, విడిచి వెళ్లిన వారిని కనీసం పట్టించుకోకుండా కుటుంబ సభ్యులు ఉండడం బాధాకరమని స్థానికులు అంటున్నారు. ఎవరైనా గుర్తు పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై ప్రవీణ్ తెలిపారు.