టాక్సీ డ్రైవర్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

టాక్సీ డ్రైవర్‌ కుటుంబానికి ఆర్థిక సహాయం

విజయనగరం స్థానిక చిక్కాల వీధి ఉన్న శ్రీనివాస్ టాక్సీ డ్రైవర్‌గా రైల్వే స్టేషన్ దగ్గర పని చేసేవాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మిగతా టాక్సీ డ్రైవర్లు అందరూ కలిసి బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. ఆర్థిక సహాయం చేసిన వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.