VIDEO: ఆకట్టుకున్న అగ్ని గుండాల ప్రదర్శన
KMR: సదాశివ నగర్ మండలం ధర్మారావుపేట్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున వీరభద్ర స్వామి ఆలయం ఆవరణలో అగ్నిగుండాల ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంది. 8 ఎడ్ల బండ్ల కర్రలను ఒకచోట పేర్చి కణ కణ మండే నిప్పురవ్వలు తయారు చేశారు. అనంతరం వాటిపై నుంచి ఓంకార నాదం శబ్దం చేస్తూ నడిచారు. ఈ కార్యక్రమంలో పూజారి జంగం విజయ్, ఆంజనేయులు, భక్తులు పాల్గొన్నారు.