ఆర్థిక సాయం కోరితే.. అత్యాచారం చేశాడు!
AP: తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతూ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటుంది. అయితే, ఆమెకు ఆటో డ్రైవర్ సాయి కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సాయిని ఆర్థిక సాయం కోరడంతో మైనర్ బాలికను మభ్యపెట్టి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు.