అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి: ట్రంప్

అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడి: ట్రంప్

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని ట్రంప్ ప్రకటించారు. టెక్సాస్‌లో బ్రౌన్స్‌విల్లే పోర్ట్ ప్రాంతంలో రిలయన్స్ భాగస్వామ్యంతో భారీ చమురుశుద్ధి కేంద్రం ఏర్పాటు కాబోతోందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విలువ 300 బిలియన్ డాలర్లు ఉంటుందని చెప్పారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద డీల్ అని ట్రంప్ వెల్లడించారు.