నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం

నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం

VSP: విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో సోమవారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ప్రారంభం కానుందని విశాఖపట్నం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10గంటలకు విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ కార్యక్రమం మొదలవుతుందని, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు.