పలు సామాజిక కార్యక్రమాలకు నిధుల మంజూరు

పలు సామాజిక కార్యక్రమాలకు నిధుల మంజూరు

ASF: కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలు సామాజిక కార్యక్రమాల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. ఏప్రిల్ 2న హనుమాన్ శోభాయాత్రకు రూ.3 లక్షలు, ఏప్రిల్ 4న బాబు జగ్జీవన్ రామ్ జయంతికి రూ. 1 లక్ష, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు రూ.2.56 లక్షలు కేటాయించాలని నిర్ణయించినట్లు కమిషనర్ తిరుపతి తెలిపారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.