VIDEO: ఖజానా జ్యువెలర్స్‌కి చేరుకున్న సైబరాబాద్ సీపీ

RR: చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీలో జరిగిన కాల్పుల ఘటనపై సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 10 బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.