'గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం'
MNCL: గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామ సర్పంచ్ అల్లం మాధవి అన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం రేండ్లగూడ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధిపై అధికారులు, వార్డు సభ్యులు చర్చించారు. జిల్లాలోని రేండ్లగూడ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఉందని ఆమె వివరించారు.