సోమూర్ - అంతాపూర్ రోడ్డును పరిశీలించిన సబ్ కలెక్టర్

సోమూర్ - అంతాపూర్ రోడ్డును పరిశీలించిన సబ్ కలెక్టర్

KMR: మద్నూర్ మండలం అంతాపూర్- సోమూర్ రోడ్డును సబ్ కలెక్టర్ కిరణ్మయి శనివారం పరిశీలించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ఆర్ & బి రోడ్డును పరిశీలించి, మరమ్మతులు గురించి సంబంధిత శాఖ అధికారులతో చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహశీల్దార్ ఎండీ ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎస్సై విజయ్ కొండ, ఆర్ & బి ఏఈ, తదితరులు ఉన్నారు.