మసీదు వద్ద ఉన్న చెత్తను తొలగించండి సారూ..!

మసీదు వద్ద ఉన్న చెత్తను తొలగించండి సారూ..!

NLR: కొడవలూరు మండలంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. మండలంలోని నార్త్ రాజుపాలెం మహమ్మదీయ మసీద్ రోడ్డు పక్కన చెత్తను డంపింగ్ చేశారు. దీంతో గాలికి ఆ చెత్త చేరి నమాజ్ చదువుకోడానికి ఇబ్బందిగా ఉందని భక్తులు వాపోతున్నారు. అటు వైపు నుంచి వెళ్లాలంటే దుర్వాసన వస్తుందని స్తానికులు పేర్కొంటుున్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి చెత్తను అక్కడి నుంచి తరలించాలని కోరుతున్నారు.