నేడు మూడో విడత పంచాయతీ ఎన్నికలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. శాంతియుతంగా, పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేందుకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. నిర్మల్ జిల్లాలో 133 సర్పంచ్ స్థానాలు, 1,126 వార్డులకు, ఆదిలాబాద్ జిల్లాలో 151 సర్పంచ్ స్థానాలు, 1,220 వార్డులకు పోలింగ్ జరగనుంది.