'బాధితుల ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించాలి'
MDK: బాధితుల ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించి న్యాయం చేయాలని మెదక్ DSP ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాధితుల నుంచి నేరుగా సమస్యలు విని బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.