పెద్దతండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

పెద్దతండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

NLG: డిండి మండలం పెద్దతండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెరుకుపల్లికి చెందిన రాములు (58) అనే వ్యక్తి మృతి చెందారు. బొల్లనపల్లి నుంచి తిరిగి వస్తుండగా శ్రీను, రాములు ప్రయాణిస్తున్న వాహనం RTC బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెనుక కూర్చున్న రాములు తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీనుకు గాయాలైనట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు.